మోహన్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురు
సీనియర్ నటుడు మోహన్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురయ్యింది. ఆయన జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం అప్లయ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై విచారించిన కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేసింది. జర్నలిస్టుపై ఆయన ఇంటివద్ద కోపంతో దాడి చేసిన ఘటనపై మీడియా కేసు నమోదు చేసింది. ఈ కేసులో హత్నాయత్నం కేసు కావడంతో ముందస్తు బెయిల్‌కు కోర్టు నిరాకరించింది. దీనితో ఆయనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.