కేసీఆర్ అవినీతిపై మోదీ ప్రత్యేక దృష్టి
ఈనెల 21 న మునుగోడులో జరిగే సభను విజయవంతం చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకట స్వామి పిలుపునిచ్చారు. ఇందుకోసం భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని సూచించారు. తెలంగాణలో కుటుంబ, నియంతృత్వ పాలన పోవాలని జనం కోరుకుంటున్నారని వివేక్ తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై మోదీ, అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారన్నారు. కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల కోసమే కేసీఆర్ మిషన్ భగీరథ పథకం తీసుకు వచ్చారని వివేక్ ఆరోపించారు. రూ. 40 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఆ పథకం పూర్తి కాలేదని, మళ్లీ రూ. 30 వేల కోట్లు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.