వ్యవసాయ డ్రోన్లపై మోదీ సర్కారు భారీ సబ్సిడీ
దేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో భారీ పథకాన్ని తీసుకొచ్చింది. వ్యవసాయ డ్రోన్లకు రూ.5 కోట్ల వరకు సబ్సిడీ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. మారుతున్న అవసరాలకు అనుగుణంగా చిన్న రైతులను ప్రోత్సహించేందుకు, వారికి మెరుగైన ఆదాయాన్ని అందించేందుకు పంటలకు ఎరువులు, ఇతర రసాయనాలను సులభంగా పిచికారి చేసేందుకు రైతులు డ్రోన్ల వాడకాన్ని పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. డ్రోన్ కెమెరాలను రసాయనాల పిచికారీతో పాటు పొలంపై ఓ కన్నేసి ఉంచేందుకూ వాడుకోవచ్చు. అందుకే దేశంలో ఎక్కువగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడేలా డ్రోన్లపై 50 శాతం లేదా రూ.5 లక్షల వరకు సబ్సిడీ ఇవ్వాలని మోదీ సర్కారు నిర్ణయించింది.

తక్కువ పెట్టుబడి.. ఎక్కువ దిగుబడి..
డ్రోన్‌పై రూ.5 లక్షల సబ్సిడీ స్కీమ్‌కు సన్నకారు రైతులు, ఈశాన్య రాష్ట్రాల రైతులు, మహిళా రైతులు అర్హులు. ఇతర రైతులు డ్రోన్‌పై రూ.4 లక్షలు లేదా డ్రోన్ ధరలో 40 శాతం వరకు సబ్సిడీకి అర్హులు. మానవ రహిత వైమానిక వాహనాలైన ఈ డ్రోన్లను UAVగా పిలుస్తారు. దేశంలోని రైతులను కొత్త వ్యవసాయ సాంకేతిక వైపు నడుపుతూ.. తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి సాధించేందుకు.. రైతులు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం వ్యవసాయ అవసరాల కోసం కొనుగోలు చేసిన డ్రోన్లపై రైతులకు ఆర్థిక సాయం అందుతుంది.