Home Page SliderInternational

 G7 సమ్మిట్ కోసం హిరోషిమా చేరుకున్న మోదీ

ప్రధాని మోదీ G7 సమ్మిట్ కోసం జపాన్‌లోని హిరోషిమాకు  చేరుకున్నారు. వివిధ దేశాల ప్రతినిధులతో, నాయకులతో తాను ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నానని ట్వీట్ చేశారు ప్రధాని.

రెండవ ప్రపంచ యుద్ధకాలంలో అమెరికా ప్రయోగించిన అణుబాంబు కారణంగా నామరూపాలు లేకుండా పోయిన జపాన్ నగరం హిరోషిమా ఇప్పుడు ప్రపంచదేశాల G7 సమ్మిట్‌కి ఆతిథ్యం ఇవ్వబోతోంది. మానవజాతి చరిత్రలో మొదటిసారిగా అణుబాంబు విధ్వంసానికి బలి అయ్యిన దేశంగా చరిత్రలో నిలిచిపోయింది ఈ నగరం. అమెరికా తయారు చేసిన లిటిల్ బాయ్ అనే ఈ అణుబాంబు 15 కిలోటన్నుల టీఎన్‌టీ శక్తిని విడుదల చేస్తూ హిరోషిమా నగరంపై విరుచుకు పడింది.

సుమారు 4 వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను విడుదల చేసిన అణ్వాయుధం దశాబ్దాల పాటు ఈ నగరాన్ని విషపూరితంగా మార్చింది. లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. ఇలాంటి నగరం ఈనాడు ఆగ్రరాజ్యాలకే ఆతిథ్యమిచ్చే స్థాయికి చేరుకోవడం హర్షనీయం.