Telangana

వందే కాదు.. మరో 50 కోట్లు.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి లెక్క ఇదీ…!

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలంటూ జరుగుతున్న మొత్తం వ్యవహారంపై పోలీసులు చర్యలు మొదలుపెట్టారు. నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారన్న ముగ్గురు వ్యక్తులపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఫరీదాబాద్‌కు చెందిన రామచంద్రభారతి, తిరుపతికి చెందిన వెంకటనాథ సింహయాజి, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నందకుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేశారు. బీజేపీలో చేరాలంటూ వంద కోట్లకు డీల్ కుదిరిందని… మిగతా ఎమ్మెల్యేలను తెస్తే మరో 50 కోట్లు కూడా ఇస్తామంటూ ఆఫర్ చేశారని పోలీసుల ఫిర్యాదులో రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చారని, అందుకే తమ ఫామ హౌస్‌కు వచ్చారని చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని రాజేంద్రనగర్‌లోని ఉప్పర్‌పల్లి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు.