Andhra PradeshHome Page Slider

2024లో ఒడిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా – ఎమ్మెల్యే పిన్నెల్లి సవాల్

వైసీపీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సవాల్ చేసారు. పల్నాడు జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్త రాజకీయాల పైన ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. ఓటమి అంటే తెలియని రాజకీయ చరిత్ర తనదని చెప్పుకొచ్చారు. కొంత కాలంగా మాచర్ల టీడీపీ ఇంఛార్జ్ బ్రహ్మారెడ్డి..వైసీపీ నేతల మధ్య రాజకీయ పోరాటం కొనసాగుతోంది. రెండు నెలల క్రితం మాచర్ల కేంద్రంగా చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమైంది. మాచర్లలో పోలీసు ఆంక్షలు కొనసాగాయి. వచ్చే ఎన్నికలు ఇక్కడ రాజకీయంగా ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఈ సమయంలోనే పిన్నెళ్లి సంచలన ప్రకటన చేసారు.

మాచర్లలో ఏం జరిగినా కొంత కాలంగా రాజకీయ వివాదంగా మారుతోంది. 2004 నుంచి మొదలైన తన వరుస విజయాలు 2024లోనూ కొనసాగుతాయని ఎమ్మెల్యే..విప్ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేసారు. 2024లో తనను ఓడించగలిగితే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని పిన్నెల్లి సవాల్ చేసారు. తన మీద ఇప్పటి వరకు ఒక్కో ఎన్నికలో ఒక్కో అభ్యర్ధిని నాలుగు సార్లు టీడీపీ ప్రయోగించిందని అందరూ ఓడిపోయారు అన్నారు.