జిల్లా అభివృద్ధిపై కేంద్ర మంత్రులతో ఎమ్మెల్యే చర్చ
తెలంగాణలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కేంద్రం రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీని శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రహదారుల సమస్యలను పరిష్కరించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అనంతరం కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో జిల్లా అభివృద్ధిపై చర్చించారు.