ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారం..
ఆదిలాబాద్: బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాయల్ శంకర్ ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ప్రచారం చేశారు. వ్యాయామ, నడక, యోగా సాధకులు, ఇలా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. అక్కడి నుండి గాంధీ పార్కులోని ఓపెన్ జిమ్‌ను సందర్శించారు. ఈ నెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటువేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు, అనేకమంది ప్రజలు పాల్గొన్నారు.

