Home Page SliderTelangana

మేడిగడ్డ ప్రాజెక్ట్ పనులపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం

తెలంగాణాలోని మేడిగడ్డ బ్యారేజ్ ప్రాజెక్ట్ పనులపై నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎల్‌ అండ్‌ టీ ప్రతి నిధులపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో నాసిరకం పనులు జరిగాయంటూ ఆయన వారిపై మండిపడ్డారు.ఈ విషయంలో మా ప్రమేయం లేదని తప్పించుకోవాలని చూస్తే ఊరుకోబోమని మంత్రి వారిని హెచ్చరించారు.ఈ మేరకు మేడిగడ్డ ప్రాజెక్ట్‌లో ఇప్పటివరకు జరిగిన పనులపై పూర్తి నివేదిక వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల్ అండ్ టీ ప్రతినిధులను ఆదేశించినట్లు తెలుస్తోంది.