UK మాజీ PMతో భేటీ అయిన మంత్రి నారా లోకేష్
ఏపీ ఐటీ, విద్యా శాఖమంత్రి నారా లోకేష్ ఇవాళ UK మాజీ PM టోనీ బ్లెయిర్‌తో భేటీ అయ్యినట్లు ట్వీట్ చేశారు. బ్రహ్మిణితో కలిసి ఈ రోజు టోనీ బ్లెయిర్‌తో సమావేశమయ్యే అవకాశం నాకు లభించింది. విద్య,ఆరోగ్యం,రాజకీయం వంటి రంగాల్లో AI ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై ఆయనతో చర్చించాము. ఆదాయాన్ని పెంపొందించడానికి దానిని ఎలా ఉపయోగించగలం అనే దానిపై మాట్లాడుకున్నామని ఆయన ట్వీట్ చేశారు. కాగా ఆయనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.