బలగం వేణుకు మంత్రి కేటీఆర్ ఆత్మీయ సత్కారం
స్వచ్ఛమైన తెలంగాణా సంస్యృతి ,సంప్రదాయాలు,ఆచారాలు ఉట్టిపడేలా రూపొందిన బలగం సినిమా తెలుగు రాష్ట్రాలలో అశేష ప్రేక్షకాదరణ పొంది బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.ఈ సినిమాలో ప్రియదర్శి ,కావ్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించారు. కాగా విడిపోయిన కుటుంబాలను కలుపుతూ..జీవితంలో బంధాల విలువను తెలియజేసేలా రూపొందించిన ఈ సినిమా ప్రతి ఒక్కరి కంటా కన్నీరు తెప్పిస్తోంది. అయితే ఈ రోజు మంత్రి కేటీఆర్ పర్యటనలో భాగంగా సిరిసిల్ల జిల్లాకు వెళ్లారు. కాగా అక్కడ ఆయన బలగం సినిమా డైరెక్టర్ వేణును పిలిపించి సన్మానం చేశారు. అయితే ఈ వీడియోను వేణు తన ట్విటర్‌లో షేర్ చేశారు.