Home Page SliderTelangana

రూ.10 వేల కోట్లను జగదీష్‌రెడ్డి తిన్నారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపణ

హైదరబాద్: తెలంగాణ విద్యుత్ రంగంపై శాసనసభలో వాడీవేఢీగా చర్చ జరిగింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో పెద్ద కుంభకోణం జరిగిందని, రూ.10 వేల కోట్లను జగదీష్‌రెడ్డి తిన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో విద్యుత్ రంగం పరిస్థితిపై శాసనసభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి మధ్య వాడీవేఢీగా చర్చ జరిగింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని, రూ.10 వేల కోట్లను జగదీష్ రెడ్డి తిన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. టెండర్ పెట్టకుండా ఇవ్వడమే పెద్ద కుంభకోణమని ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కార్ 24 గంటల కరెంట్ ఎప్పుడూ ఇవ్వలేదు. సబ్ స్టేషన్లలో లాగ్‌బుక్‌లు చెక్ చేస్తే ఇదంతా తెలుస్తుంది. నేను వెళ్లిన తర్వాత లాగ్‌బుక్‌లు మాయం చేశారు.