Home Page SliderTelangana

హరీష్ రావుకు మంత్రి జూపల్లి కౌంటర్

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వస్తా.. అని సవాల్ విసురుతున్నారని, అయితే సీఎం రావాల్సిన అవసరం లేదని, తాను చర్చకు వస్తానని, ఎవరు దోచుకున్నారో తేల్చేందుకు ఎల్బీ స్టేడియంలో ప్రజల మధ్య చర్చిద్దామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇవాళ గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూసీ రివర్ ఫ్రంట్ లక్షా యాభై వేల కోట్ల దోపిడీ జరిగిందని కేటీఆర్, హరీశ్ రావు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణను మొత్తం దోచుకున్నది వాళ్లేనని, రాజకీయంగా దివాలా తీసిండ్రు కాబట్టి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు.