NationalNews

త్వరలో మధ్యంతర ఎన్నికలు

మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రే తనయుడు, మాజీ మంత్రి ఆదిత్యా థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారు. త్వరలో రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయన్నారు. ఎన్నికలకు ఎదుర్కొనేందుకు కార్యకర్తలు రెడీగా ఉండాలని కోరారు. అకోలా జిల్లాలోని బాలాపూర్‌లో కార్యకర్తల ర్యాలీలో ఆదిత్యా థాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని.. 2.5 లక్షల మంది యువత ఉపాధి అవకాశాలు కోల్పోయిందన్నారు. మహారాష్ట్రలో రాజ్యాంగ విరుద్ధంగా షిండే ప్రభుత్వం నడుస్తోందని ఆదిథ్య థాక్రే ఆరోపించారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని.. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.