రాత్రి 11 గంటల వరకు మెట్రో సేవలు
హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలను రాత్రి 11 గంటల వరకు పొడిగించారు. ప్రస్తుతం రాత్రి 10 గంటల 15 నిమిషాల వరకే ఉన్న చివరి రైలు సోమవారం నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం యథాప్రకారం 6 గంటలకే తొలి రైలు ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. రాత్రి ఎక్కువ సేపు ఉద్యోగాలు చేసే వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.