NationalNews

పెరగనున్న మెట్రో చార్జీలు..!

మెట్రో రైలు చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత చార్జీలు సవరించాలన్న మెట్రో రైలు సంస్థ అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ(ఎఫ్‌ఎఫ్‌సీ)ని ఏర్పాటు చేసింది. హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి గుడిసేవ శ్యామ్‌ ప్రసాద్‌ చైర్మన్‌గా కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్‌ సురేంద్ర కుమార్‌ బగ్దె, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ సభ్యులుగా కమిటీని నియమించింది. ఈ కమిటీ విశ్లేషించి మెట్రో రైలు చార్జీలు పెంచడంపై నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం ఉన్న చార్జీల సవరణకు సంబంధించి తమ అభిప్రాయాలు, సలహాలను నవంబరు 15వ తేదీలోగా తెలపాలని ప్రయాణికులను కమిటీ చైర్మన్‌ శ్యామ్‌ ప్రసాద్‌ కోరారు.