తమ్ముడు పవన్ కల్యాణ్‌కి ఎందుకు ఓటేయాలో చెప్పిన మెగాస్టార్ చిరంజీవి
పవన్ కల్యాణ్, తన గురించి కంటే సమాజం కోసం ఆలోచిస్తాడన్నారు మెగాస్టార్ చిరంజీవి. అధికారంలో లేనప్పుడే, ఎందరికో సాయం చేశాడన్నారు. పవన్ కల్యాణ్ సినిమాల్లోకి బలవంతంగా వచ్చాడని, రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చాడని చెప్పారు. తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తోందన్నారు. తన తమ్ముడో ఎంతో మంది బిడ్డల కోసం యుద్ధం చేస్తున్నాడన్నారు. అన్యాయాన్ని ఎదిరించకుండా, మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లే ప్రజాస్వామ్యం మరింత నష్టమని నమ్మి, జనం కోసం జనసైనికుడయ్యాడన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి తన తమ్ముడన్నారు. ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్ కోసం, ఆ శక్తిని వినియోగించాలంటే, చట్టసభల్లో అతని గొంతు వినాలన్నారు. జనమే జయమని నమ్మిన జనసేనాని ఏం చేయగలడో చూడాలంటే, ప్రజలు పుఠాపురంలో పవన్ కల్యాణ్ ను గెలిపించాలన్నారు.