Home Page SliderPoliticsTelanganatelangana,

అన్ని పార్టీల ఎంపీల భేటీ..ఎందుకంటే..

తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. శనివారం నాడు తెలంగాణలో అన్ని పార్టీల ఎంపీల సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఎంపీల భేటీ జరగనుంది. ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో ఉన్న అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరుకానున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డికి, బండి సంజయ్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. కేంద్రప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు, కేటాయింపులపై ప్రత్యేక చర్చలు ఉంటాయని సమాచారం.