మ్యాట్రీమోనీ ముసుగులో మస్కాలు
దేశంలో సైబర్ క్రైమ్ రేటు రోజు రోజుకి పెరిగిపోతుంది. మొన్నటి వరకు లోన్ యాప్ మోసాల పై ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మ్యాట్రీమోనీ కేసులు వెలుగులోకి వచ్చాయి. మ్యాట్రీమోనీలో ప్రొఫైల్ పెట్టిన వారిని టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. దీనిలో ప్రధానంగా రెండో వివాహం కోసం ప్రొఫైల్ పెట్టిన మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం. వెబ్ సైట్లో వారు పెట్టిన వివరాల ఆధారంగా నైజీరియన్లు ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు సమాచారం.

విదేశాల్లో ఉన్నత స్థానంలో ఉన్నామంటూ మెసేజ్లు పంపుతూ పరిచయం మొదలు పెడుతున్నారు. అంతేకాక విలువైన బహుమతులను పంపిస్తున్నమంటూ వారికి వల వేస్తున్నారు. ఈ క్రమంలోనే భాగంగానే కస్టమ్స్ అధికారుల మంటూ వేరొకరితో ఫోన్స్ చేయించడం , టాక్స్ కట్టాలి అంటూ రూ. లక్షలు కాజేస్తున్నారు. ఇలాంటివారితో కాస్త జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.