National

పెళ్లి కావాలంటే ఈ అర్హతలు వరుడికి ఉండాల్సిందేనట..

మనసర్కార్

వరుడు కావాలి, వధువు కావాలంటూ పత్రికల్లో, మ్యాట్రిమోనీ సైట్స్‌లో పెళ్లి సంబంధాల వివరాలు పెట్టడం మామూలే. కానీ ఢిల్లీలో ఓ మ్యాట్రిమోనియల్ యాడ్‌పై ఇంటర్నెట్లో కామెంట్లు వెల్లువెత్తాయి. వరుడి అర్హతల గురించి వధువు తరపు వారికి కొన్ని డిమాండ్లు ఉండడం మామూలే కానీ ఇక్కడ వధువుకి మామూలు వరుడు వద్దంట. కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలట. అవేంటంటే వరుడు ప్రముఖ విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం చేసుండాలి. ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్, వంటి మంచి పీజీ డిగ్రీ ఉండాలి. అదికూడా ఐఐటీ, ఎన్ ఐటీ, బిట్స్ వంటి వాటిలోనే ఉండాలి. పెద్ద కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం ఉండాలి. సంవత్సరానికి 30 లక్షలకు తక్కువ జీతం ఉండకూడదు. 1992 తర్వాత జన్మించిన వారే అయి ఉండాలి. చిన్న కుటుంబం, బాగా చదువుకున్న కుటుంబం అయి ఉండాలి. అబ్బాయి ఐదు అడుగుల ఎనిమిదంగుళాల పైగా ఎత్తు ఉండాలి. తెల్లగా ఉండాలి. లావుగా ఉండకూడదు. ఇవన్నీ కనీస అర్హతలుగా రాసుకొచ్చారు వధువు కుటుంబం. దీనిపై నెట్టింట్లో రకరకాల విమర్శలు వెల్లువెత్తాయి. ఆమెకు భర్త కావాలా, రోబో కావాలా, భర్తను నియమించుకుంటుందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. పైగా కొందరు ఇదే తరహాలో ఒక అబ్బాయి కూడా అమ్మాయి గురించి జాబితా పెట్టి ఉంటే ఎన్ని విమర్శలు వచ్చేవో అంటూ నెటిజన్లు నోళ్లు నొక్కుకుంటున్నారు.