E చెల్లింపుల కోసం UPI లావాదేవీ పరిమితి భారీగా పెంపు
పన్ను చెల్లింపులు, ఆసుపత్రులు, విద్యా సంస్థల చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్
IPO, RBI రిటైల్ డైరెక్ట్ పథకాలలో పెట్టుబడులకు ఛాన్స్
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొన్ని రకాల చెల్లింపుల కోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీల పరిమితిని ₹ 5 లక్షలకు పెంచింది. సెప్టెంబర్ 16 నుండి అమలులోకి వచ్చే ఈ మార్పు UPI ద్వారా అధిక-విలువ లావాదేవీలు చేసే వినియోగదారులకు మరింత సౌలభ్యం, సౌకర్యం కోసం చేశారు. UPI లావాదేవీ పరిమితి, ప్రతి లావాదేవీకి ప్రస్తుతం లక్ష రూపాయల వరకు అవకాశం ఉంది. కేపిటల్ మార్కెట్‌లు, కలెక్షన్‌లు, బీమా, విదేశీ ఇన్‌వార్డ్ రెమిటెన్స్‌ల వంటి నిర్దిష్ట వర్గాలకు ₹ 2 లక్షల కంటే కొంచెం ఎక్కువ పరిమితి ఉంటుంది. ఆగస్ట్ 24 నాటి NPCI సర్క్యులర్ ప్రకారం, పన్ను చెల్లింపులు, ఆసుపత్రులు, విద్యా సంస్థలకు చెల్లింపులు, IPOలు, RBI రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌లలో పెట్టుబడులకు సంబంధించిన లావాదేవీలకు ఈ పరిమితి ₹ 5 లక్షలకు పెరుగుతుంది.

NPCI సర్క్యులర్ ప్రకారం పాటించాల్సిన షరతులు
బ్యాంక్‌లు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు (PSP), UPI యాప్‌లు… వ్యాపారుల వర్గాల కోసం ప్రతి-లావాదేవీ పరిమితిని తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి.
‘MCC-9311’ కింద వర్గీకరించిన వ్యాపారులు ప్రత్యేకంగా పన్ను చెల్లింపుల విషయంలో ఆయా ఎంటిటీలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పెమెంట్ చేసేందుకు అనుమతించవచ్చు.
వ్యాపారులు ప్రత్యేకంగా పన్ను చెల్లింపుల కోసం కొత్త పరిమితి వరకు లావాదేవీల కోసం తప్పనిసరిగా UPIని చెల్లింపు ఎంపికగా చేసుకోవాలి.
భారతదేశంలో చెల్లింపు పద్ధతికి పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా UPI లావాదేవీ పరిమితిని పెంచాలని NPCI నిర్ణయం తీసుకుంది.

“UPI ప్రాధాన్య చెల్లింపులు పెరుగుతున్నందున ప్రతి లావాదేవీ పరిమితిని పెంచాల్సిన అవసరం ఉంది” అని NPCI సర్క్యులర్‌లో పేర్కొంది.
బ్యాంకులు, చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్లు, UPI యాప్‌లతో సహా చెల్లింపుల వ్యవస్థలోని వాటాదారులందరినీ కొత్త లావాదేవీ పరిమితులకు అనుగుణంగా సిస్టమ్ అప్‌డేట్ చేసుకోవాలని కోరింది.
ఈ నిర్ణయం అధిక-విలువ లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి, గణనీయమైన ఆర్థిక కార్యకలాపాలలో ఎక్కువ మందిని భాగస్వామ్యుల్ని చేయడానికి దోహదకారి అవుతుందని భావిస్తున్నారు.
కొత్త పరిమితి ప్రకారం లావాదేవీలు సజావుగా జరిగేలా చూసుకోవడానికి, వినియోగదారులు తమ నిర్దిష్ట లావాదేవీలకు పెరిగిన పరిమితి వర్తిస్తుందో లేదో వారి బ్యాంకులు, UPI సర్వీస్ ప్రొవైడర్‌లతో ధృవీకరించుకోవాలని సర్క్యులర్ అభిప్రాయపడింది.