ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హిండీస్ ఫార్మా ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీ నుంచి భారీ శబ్దం రావడంతో భయంతో జనాలు పరుగులు పెట్టారు. ఘటనా స్థలంలో మంటలు భారీగా ఎగిసిపడుతుడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.