అసెంబ్లీలో మసాజ్ కుర్చీలు..
కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేల సౌకర్యం కోసం మసాజ్ కుర్చీలు, రిక్లైనర్ ఛైర్లు ఏర్పాటు చేయాలని స్పీకర్ యూటీ ఖాదర్ ప్రతిపాదించారు. అలాగే ఎమ్మెల్యేల గదుల్లో స్మార్ట్ లాక్‌ల కోసం రూ. 3 కోట్లు కేటాయించాలని సూచించారు. ఇవి తన అభిప్రాయం మాత్రమేనని, అసెంబ్లీ సభ్యులందరితో చర్చించి ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడి చేశారు. అసలే అసెంబ్లీకి డుమ్మా కొట్టే ఎమ్మెల్లేలు, మంత్రులు ఇలా మసాజ్ ఛైర్లు ఏర్పాటు చేస్తే అక్కడే రిలాక్స్ అవుతూ ఉంటారని, నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

