అక్కడ 3 నెలలు పెళ్లిళ్లు బ్యాన్..ఎందుకంటే..
ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం ఉన్న నగరంగా నమోదైన పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో మూడు నెలల పాటు వివాహాలను బ్యాన్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ వాయు కాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కట్టడి కావడం లేదు. దీనితో స్కూళ్లను బలవంతంగా మూసివేస్తున్నారు. పార్కులు, మ్యూజియంలు కూడా సెలవు రోజుల్లో తెరవడం లేదు. వివాహ సంబరాలను నిషేధించారు. నేడు అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాదాపు 1600గా తేలింది. ఇక్కడ 24 గంటల్లో దాదాపు 15 వేల మంది శ్వాస సంబంధ సమస్యలతో ఆసుపత్రులలో చేరారు.

