Home Page SliderNational

మనీష్ సిసోడియా 5 రోజుల సీబీఐ కస్టడీ

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీష్ సిసోడియాను 5 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. సిసోడియా రౌస్ అవెన్యూ కోర్టుకు చేరుకుని న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ముందు హాజరుపరిచారు. సీబీఐ కోర్టు మనీష్ సిసోడియాకు మార్చి 4 వరకు ఐదు రోజుల కస్టడీని మంజూరు చేసింది. మనీష్ సిసోడియాను అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీలోని బీజేపీ కార్యాలయాల దగ్గర నిరసన చేపట్టారు. బీజేపీ ప్రధాన కార్యాలయం, ఆప్ కార్యాలయం రెండూ ఉన్న డిడియు మార్గ్‌కు వెళ్లే అనేక రహదారులపై ఢిల్లీ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.