కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్
తన కుటుంబంలో ఇలాంటి ఘటనలు జరగడంపై ఎంతో విచారం చేస్తున్నానని మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు మంచు మనోజ్. “నాన్న తరపున జర్నలిస్టులకు తాను క్షమాపణలు చెప్తున్నాను. నా కోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం ఎంతో విచారం కలిగించింది. నేను ఆస్తుల కోసం ఎలాంటి గొడవలు పడలేదన్నారు. సొంతంగా వ్యాపారం చేసి సంపాదించుకున్నట్లు చెప్పారు. నేను ఎవరి మీదా దాడి చెయ్యలేదు. సీసీ కెమెరా దృశ్యాలు చూపించాలని సవాల్ చేస్తున్నా. ఈ గొడవలలో నా భార్య, బిడ్డలను లాగుతున్నారు. నేను ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తే బంధువుల కాళ్లు కూడా పట్టుకుంటాను. ఈ రోజు సాయంత్రం అన్ని విషయాలు వివరిస్తా”.. అని పేర్కొన్నారు.
Breaking news: మోహన్‌బాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి..