కూకట్‌పల్లి లో భారీ అగ్నిప్రమాదం..
హైదరాబాద్ కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లోని పల్లవి రెస్టారెంట్‌లో గ్యాస్ లీక్ అవడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు రావటంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.