ఎగ్జిబిషన్‌లో భారీ అగ్నిప్రమాదం
విజయవాడ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సితార సెంటర్ లో ఏర్పాటు చేసిన కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్‌లో ఒక్కసారిగా ఎగసిపడిన మంటలతో దుకాణాలు కాలి బూడిదయ్యాయి. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గ్యాస్ సిలిండర్ పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. నిత్యం వేల సంఖ్యలో జనం ఎగ్జిబిషన్ కు తరలి వస్తున్నారు. సందర్శకులు ఎవరు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్టైంది. మంటలతో దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. వాటిలో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.