Andhra PradeshHome Page Slider

మహసంద్రాన్ని తలపించిన టీడీపీ మహనాడు

ఏపీలోని గోదావరి తీరంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు కార్యక్రమం విజయవంతమైంది. రెండు రోజులు కార్యక్రమంలో తొలిరోజే అంచనాలకు మించి తెలుగు తమ్ముళ్లు తరలివచ్చారు. రెండో రోజు మహానాడు కార్యక్రమం పూర్తిగా ఎన్టీఆర్ శతజయంతి వేడుక గానే సాగింది. తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ ముగింపు సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు కూడా పచ్చదండు వెల్లువలా తరలివచ్చింది. కార్యకర్తల హుషారు చూసి నాయకుల్లోను ఉత్సాహం తోనికి సలాడింది. వచ్చే ఎన్నికలకు శంఖారావం పూరించి విజయం మనదే అన్న ధీమా కలిగించింది. రాజమహేంద్రవరం రూరల్ వేమగిరిలో రెండు రోజులు పాటు నిర్వహించిన మహానాడు కార్యక్రమం పార్టీ అధిష్టానం అంచనాలను తలకిందులు చేసింది. నేతలు ఊహించిన దానికంటే అత్యధికంగా కార్యకర్తల నుండి స్పందన రావడం వారిలో జోష్ ను నింపింది. వచ్చిన వారందరికీ భోజన వసతి సదుపాయం కల్పించడం సవాలుగా మారింది. తొలి రోజు ప్రతినిధుల సభకు కేవలం 15 వేల మంది వస్తారని భావించిన సుమారు 50 వేల మందికి ఆహార సదుపాయం కల్పించారు. కానీ శనివారం ఒక్కరోజే సుమారు లక్ష మందికి ఆహారం వండి వడ్డించటం చూస్తే తెలుగు తమ్ముళ్లు ఏ రేంజ్ లో స్పందించారో అర్థమవుతుంది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత సభ కొంత ఖాళీ అయినప్పటివరకు లోపలికి రావడానికి ఇబ్బంది పడ్డవారికి అవకాశం లభించింది. పార్టీ ప్రవేశపెట్టిన తీర్మానాలకు పసుపు దండు హర్షద్వానాలు తెలుపుతూ మద్దతు ప్రకటించటించాయి.

రాష్ట్రంలో పెరుగుతున్న ధరలు, పన్నులు ,చార్జీల బాదుడే బాదుడు బీసీల ద్రోహి జగన్ రెడ్డి సంక్షేమంలో ఎస్సీ, ఎస్టీ మైనార్టీ ఇతరుల సంక్షేమం కన్పించలేదన్నారు.అంతేకాకుండా సీఎం జగన్ జాబ్ క్యాలెండర్ పై మాట తప్పి మడమ తిప్పైరన్నారు.ఏపీకి వచ్చిన పెట్టుబడులు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్ళటం అడుగంటిన పారిశ్రామికతకు సూచనగా ఉందన్నారు.జగన్ హయాంలో మహిళా ప్రగతి సంక్షేమంలో కోతలు అడ్డు అదుపు లేని అత్యాచారాలు, హత్యలు పెట్రేగిపోయాయన్నారు. ఏపీలో విద్యా ప్రమాణాలు దిగజారిపోయాయన్నారు. అనారోగ్య శ్రీ వైద్య ఖర్చులతో అప్పులలో కూరుకుపోయిన కుటుంబాలు, రైతును దగా చేసిన జగన్ రెడ్డి పాలన ఏపీని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందన్నారు.అంతేకాకుండా రాష్ట్రంలో వ్యవసాయం, నీటిపారుదల రంగం వంటి అంశాలతో పాటు రాజకీయ తీర్మానాన్ని కూడా తొలి రోజు సభలో ప్రవేశపెట్టి కార్యకర్తల హర్షద్వానాలతో ఆమోదించారు. తొలి రోజు మహానాడు ప్రతినిధుల సక్సెస్ కావటంతో అధినేత చంద్రబాబులో మంచి జోష్ కనిపించింది. వరుసగా 14వ సారి ఆయన పార్టీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికవటం లాంచనంగానే ముగిసింది. అంతటితో మొదటి రోజు మహానాడు పండుగ ముగియగా రెండో రోజు ఆదివారం ఎన్టీఆర్ శతజయంతికే మహానాడు ప్రాధాన్యత ఇచ్చింది. శనివారం మహానాడు ప్రాంగణం వద్ద బస చేసిన చంద్రబాబు ఆదివారం అక్కడ నుంచి రాజమహేంద్రవరం నగరంలోని కోటిపల్లి బస్టాండ్ సెంటర్ చేరుకున్నారు సీనియర్ నాయకులు రాజమహేంద్రవరం రూరల్ నాయకులు నేతృత్వంలో చంద్రబాబు దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలను కురుక్షేత్ర యుద్ధంతో పోల్చిన చంద్రబాబు తొలి దశ మ్యాని ఫెస్టోను కూడా విడుదల చేశారు. మహిళలు యువత రైతులు బీసీలు పేదలకు ఇందులో పెద్దపేట వేశారు. దసరా పండుగ సమయానికల్లా పూర్తిస్థాయి మేనిఫెస్టోని విడుదల చేస్తామని చెప్పారు. కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టో వివరించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి సైనికుల్లా శ్రమించాలని పిలుపునిచ్చారు. ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. మొత్తం మీద రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలు నాయకులు మహానాడు సభ ప్రాంగణం నుండి పయనమయ్యారు.