Breaking NewsHome Page SliderNationalNewsPolitics

గుజరాత్‌‌లో కమలం గుబాళింపు, హిమాచల్‌లో హోరాహోరీ

అందరూ అనుకున్నట్టుగానే గుజరాత్‌లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేస్తోంది. 182 స్థానాల్లో ఇప్పటి వరకు బీజేపీ 155 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 18 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఏడు స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఇక ఇతరులు రెండు చోట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో హోరాహోరీ తప్పదని సర్వేలు స్పష్టం చేయగా.. ఫలితాలు సైతం అదే తరహాలో వస్తున్నాయ్. ఐతే హిమాచల్‌లో కాంగ్రెస్ పార్టీ 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 31 స్థానాల్లో లీడ్‌లో ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో ముగ్గురు బీజేపీ రెబల్స్ ఆధిక్యంలో ఉండగా, ఒక కాంగ్రెస్ రెబల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.