Home Page SliderNational

ఆ రాష్ట్రంలో ఆరు రోజులు మద్యం షాపులు బంద్

మందుబాబులకు మద్యం షాపులు బందంటే దిక్కుతోచదు. బంద్ అని తెలిస్తే ముందుగానే స్టాక్ తెచ్చి పెట్టుకుంటారు. అయితే హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కారణంగా అక్కడ మద్యం దుకాణాలు బంద్ చేయాలని నిర్ణయించారు. హర్యానాతో పాటు హర్యానా సరిహద్దుకు 100 మీటర్ల దూరంలోని ఢిల్లీకి చెందిన మందు దుకాణాలకు కూడా మూడు రోజుల పాటు బంద్ ప్రకటించారు. హర్యానా ఎన్నికల ఓటింగ్‌కు మూడు రోజుల ముందు నుండి పోలింగ్ పూర్తయిన రోజు సాయంత్రం 6 గంటల వరకూ మద్యం షాపులు మూసి ఉంచాలని ఆదేశించారు అధికారులు. దీనితో పాటు ఢిల్లీలో మరో మూడు రోజులు కూడా మద్యం షాపులు మూసేయాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించింది. ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ ప్రకారం అక్టోబర్‌లో గాంధీ జయంతితో పాటు అక్టోబర్, నవంబర్ నెలలలో ఢిల్లీలో దాదాపు ఆరు రోజులు షాపులు బంద్ చేయాలని ప్రకటించారు.