Telangana

రాజగోపాల్‌ రెడ్డి మాదిరిగా మా వాళ్లు అమ్ముడుపోరు

నలుగురు ఎమ్మెల్యేలను కొనాలని బీజేపీ నేతలు కుట్ర పన్నారని.. తమ ఎమ్మెల్యేలే పోలీసులకు సమాచారం ఇచ్చారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ చెప్పారు. కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీలోనూ బీజేపీ ఇలాంటి కుట్రలే పన్నిందని గుర్తు చేశారు. మునుగోడులో ఓడిపోతామనే భయంతోనే బీజేపీ నేతలు ఇలాంటి కుట్రలకు పాల్పడ్డారని తెలిపారు. రాజగోపాల్‌ రెడ్డి మాదిరిగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని, టీఆర్‌ఎస్‌ను బలహీనం చేసేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలు ఫలించవని ధీమా వ్యక్తం చేశారు.