ఆయన అరెస్ట్ పై స్టే ఎత్తివేయండి
ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసులో కేటిఆర్ పై ఉన్న స్టే ని ఎత్తివేయాలని ఏసిబి.. కోర్టుని కోరింది. కోర్టు ఆదేశాల మేరకు కేటిఆర్‌పై కౌంటర్ దాఖలు చేసింది. కేటీఆర్ నాట్ టు అరెస్ట్‌ను ఎత్తివేయాలని ఏసిబి పిటీషన్ వేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు కేటిఆర్ ని ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 31కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.