కామారెడ్డిలో BJPని గెలిపిద్దాం.. దేశ చరిత్రలో లిఖిద్దాం
కామారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఒకేసారి ఓడించే ఛాన్స్ కామారెడ్డి ప్రజలకొచ్చిందని కేంద్ర మంత్రి పర్షోత్తమ్ అన్నారు. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి బుధవారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలోనే ఎవరికీ రాని అవకాశం కామారెడ్డి ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు వచ్చిందన్నారు. అవినీతి బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు బుద్ధి రావాలంటే బీజేపీ గెలిచి తీరాలన్నారు. ఆయన గురించి: పర్షోత్తమ్ ఖోడాభాయ్ రూపాలా భారత్‌కు చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం కేంద్ర మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన గుజరాత్ రాష్ట్రం నుండి బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు.