Home Page SliderTelangana

తెలంగాణ బీజేపీపై కావాలనే దుష్ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోం

తెలంగాణాలో బీజేపీ పార్టీపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బీజేపీ,బీఆర్‌ఎస్  ఒకటేనంటూ బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణాలో బీజేపీ 2019 నుండే బలంగా మారిందన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికలలో అది రుజువయ్యిందని, జీహెచ్ ఎంసీ ఎన్నికలలో కూడా బలంగా నిలబడ్డామని తెలియజేశారు. మునుగోడులో కూడా బీజేపీనే గెలిచినట్లని పేర్కొన్నారు. ప్రధాని మోదీ వరంగల్ పర్యటనపై రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే సమీక్ష నిర్వహించారని, బీజేపీ చాపకింద నీరులా తెలంగాణ అంతటా వ్యాపిస్తోందని జూలై 8న వరంగల్‌లో ప్రధాని మోదీ సభ తప్పకుండా విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈటలను తెలంగాణా ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే.