Home Page SliderTelangana

డ్రైవింగ్ నేర్చుకుంటూ చెరువులోకి…

ఇద్దరు వ్యక్తులు కారు డ్రైవింగ్ నేర్చుకుంటూ చెరువులోకి దూసుకెళ్లిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. బతుకమ్మ కుంట సమీపంలో మైదానంలో కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తూ కుంటలోకి కారుతో సహా వెళ్లిపోతుండగా, స్థానికులు గమనించారు. వారిని అప్రమత్తం చేసి, కారు లాక్ తీసి చెరువులోకి దూకమని కేకలు వేశారు. వారు ఒకరి తర్వాత ఒకరుగా చెరువులోకి దూకగా, ఈదుతూ వచ్చిన వ్యక్తి వారిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. దీనితో ఊపిరి తీసుకున్నారు. కారు డ్రైవింగ్ నేర్చుకుంటూ పెద్ద ప్రమాదానికి గురయ్యారని స్థానికులతో వెల్లడించారు.