Home Page SliderTelangana

GHMC లో 150 వార్డు కార్యాలయాలు ప్రారంభించిన కేటీఆర్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నేటి నుండి వార్డు కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. GHMC లో 150 వార్డు కార్యాలయాలు  ఈ రోజు ప్రారంభిస్తున్నారు. కాచిగూడాలోని వార్డు కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యాలయాల కారణంగా పౌరులకు వేగంగా సేవలు అందుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రతీ వార్డు ఆఫీసులో 10 మంది సిబ్బంది ఉంటారని, క్షేత్రస్థాయిలో సత్వర సమస్యల పరిష్కారానికి వీరు తోడ్పడతారన్నారు. దేశంలోనే ఇలాంటి వ్యవస్థ ఇదే మొదటిసారన్నారు. అన్ని రంగాలలో సమస్యలను ఈ వార్డులు తీరుస్తాయన్నారు. పార్టీలకతీతంగా ఈ సేవను చేయాలని, అన్ని పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. వార్డు మెంబర్ ఏ పార్టీకి చెందిన వారైనా పరిపాలనకు సహకరించాలని, తెలంగాణాను దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలని ఆశించారు. వ్యక్తులు శాశ్వతం కాదనీ, వ్యవస్థలే శాశ్వతమని ఆయన అభిప్రాయపడ్డారు.