“చట్నీలో చిట్టిఎలుక”పై విమర్శలు గుప్పించిన కేటీఆర్
తెలంగాణాలో నిన్న JNTU కాలేజ్ హాస్టల్‌లో చట్నీలో చిట్టిఎలుక పడడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. తెలంగాణాలో కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ హాస్టల్‌లో కలుషిత ఆహరం వల్ల పిల్లలు ఆస్పత్రుల పాలవుతున్నారని ఆయన విమర్శించారు. “మొన్న భువనగిరిలో కలుషిత ఆహారం.నిన్న కొమటిపల్లిలో ఉప్మాలో బల్లి.ఇప్పుడు చట్నీలో ఎలుక. ఈ విషాహారం తింటే విద్యార్థుల ప్రాణాలకు గ్యారంటీ ఎవరు?మార్పు కావాలి..కాంగ్రెస్ రావాలి అంటే పెద్ద మార్పే తెచ్చారు. ఇకనైనా తెలంగాణా సర్కార్ కళ్లు తెరవాలని” కేటీఆర్ ట్వీట్ చేశారు.