Home Page SliderTelangana

క్యాన్సర్ బాధితురాలికి రెండున్నర లక్షల సాయం అందించిన కొండా సురేఖ

వరంగల్ జిల్లాలోని సంగెం మండలం మొండ్రై.. ప్రాంతానికి చెందిన జీ. సుమలత గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు.. లక్షలలో వైద్యం చేసుకోలేక పేదరికంతో బాధపడుతున్న ఆ కుటుంబం అటవీ, పర్యావరణ & దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారిని కలిశారు.. మంత్రి సురేఖ వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువచ్చి సమస్య తీవ్రతను తెలియజేసి.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2,50,000 రూపాయలను మంజూరు చేయించి సంబంధిత పత్రాలను బాధిత కుటుంబానికి అందజేశారు… ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ… పేద ప్రజల వైద్యానికి మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆపదలో ఉన్న రోగులను ఆదుకునేందుకు అన్ని విధాల అండగా ఉంటామని అన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మన ప్రభుత్వం పని చేస్తుందని ఆర్ధిక స్థోమత కారణంగా ఎవరు దిగులుపడవద్దు వారికి మన ప్రజా ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అండగా వున్నారు అని అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందాన్నారు.. ప్రజా వైద్య సమస్యల దృష్ట్యా ఆరోగ్య శ్రీ 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచిన ఘనత మన ప్రభుత్వం కు దక్కుతుంది అని మంత్రి అన్నారు.