‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ఎవరో తెలుసా?
మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్‌పై ఒక సినిమా వచ్చిందన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. కొన్ని అనుకోని పరిస్థితులలో మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారన్న సంగతి ఈ చిత్రంలో చూపించారు. పదవీకాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయనపై వచ్చిన ఒత్తిళ్లు ఈ చిత్రంలో హైలెట్‌గా నిలిచాయి. ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అంటూ ఆయనపై వచ్చిన ఈ సినిమాను ఆయన సన్నిహితుడు సంజయ్ బారు రచించిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు. సంజయ్ బారు పాలసీ అనలిస్ట్, జర్నలిస్ట్. 2004లో మన్మోహన్‌ను ప్రధానిగా ఎంపిక చేయడం, అనంతర పరిస్థితులను గురించి ఈ చిత్రంలో వివరంగా చూపించారు. మన్మోహన్ సింగ్‌తో కాంగ్రెస్ పెద్దలు, గాంధీ, నెహ్రూల కుటుంబసభ్యుల ప్రవర్తనలు, దేశ పాలనలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, పాలసీలు అమలు చేయడంలో సంఘర్షణలు చక్కగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో మన్మోహన్ సింగ్ పాత్రను బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పోషించగా, సంజయ్ బారు పాత్రను అక్షయ్ ఖన్నా పోషించారు.