Home Page SliderNational

హమ్మయ్య 180 పరుగుల వద్ద అవుటైన ఖవాజా, ఆస్ట్రేలియా 443/8

ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఆతిథ్య జట్టు సత్తా చాటుతోంది. 443 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి ఆటను కొనసాగిస్తోంది. మూడు టెస్టులు పట్టుమని మూడు రోజులు కూడా జరగని పరిస్థితుల్లో గుజరాత్, అహ్మదాబాద్‌లో జరుగుతున్న టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో రోజు రెండో సెషన్‌లో రవిచంద్రన్ అశ్విన్ సత్తా చాటాడు. దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ ఆశలు వమ్మయ్యాయి. మూడు వికెట్లు వరుసగా పడగొట్టడంతో ఆస్ట్రేలియా కంగారుకు గురయ్యింది. టీ తర్వాత తొలి బంతికే ఉస్మాన్ ఖవాజా (180)ను అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. కామెరాన్ గ్రీన్, ఉస్మాన్ ఖవాజా మధ్య 206 పరుగుల భాగస్వామ్యాన్ని అశ్విన్ 114 పరుగుల వద్ద అవుట్ చేశాడు. నాలుగు బంతుల తర్వాత, అశ్విన్ వేసిన బంతికి అలెక్స్ కారీ డకౌట్‌లో అయ్యాడు. ఆ తర్వాత మిచెల్ స్టార్క్‌ను ఔట్ చేసి ఆస్ట్రేలియా పతనాన్ని నమోదు చేశాడు.

courtesy bcci twitter

అంతకుముందు, ఆట ముగిసే సమయానికి 49 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న గ్రీన్, 1వ రోజు తన 14వ సెంచరీతో చెలరేగిన ఉస్మాన్ ఖవాజాతో పాటు తన తొలి టెస్టు శతకం సాధించాడు. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత, ఆస్ట్రేలియా 1వ రోజు మొత్తం నాలుగు వికెట్లు కోల్పోయింది, ఖవాజా, 14వ టెస్టు శతకం సాధించాడు. భారత గడ్డపై తొలిసారిగా సెంచరీ సాధించాడు. అశ్విన్‌కు నాలుగు వికెట్లు పడ్డాయి. మూడు టెస్టులు రిజల్ట్స్ రాగా… నాలుగో టెస్టు ఎలాంటి మలుపు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ టెస్టు డ్రా అయినా టీమ్ ఇండియా సీరిస్ గెలుచుకున్నట్టే.. ఒకవేళ ఆస్ట్రేలియా, టీమిండియాను ఓడిస్తే… టెస్ట్ ప్రపంచ ఛాంపియన్‌ హోదా ఆ దేశ నిలబెట్టుకున్నట్టే…