హర్యానాలో ఘోర పరాజయంపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం పాలయ్యింది చీపురు పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయం విషయంలో అధ్యక్షుడు కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలలో ఒంటరిగా దిగి అతివిశ్వాసం చూపించామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతీ ఎన్నిక, ప్రతీ స్థానం కఠినమైనదేనని, అంతర్గత పోరు లేకుండా కష్టపడి పనిచేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు హితవు చెప్పారు. కాగా హరియాణాలో మూడవసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది బీజేపీ. కాంగ్రెస్, ఆప్‌లు విడివిడిగా పోటీ చేయడం బీజేపీకి కలిసివచ్చింది. చివరికి అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తల్లకిందులు చేసి, బీజేపీ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. హర్యానాలో ఖాతా తెరవని ఆమ్ ఆద్మీ పార్టీ త్వరలో ఢిల్లీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆచి,తూచి అడుగులు వేయనుంది.

