NewsTelangana

కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్

దుఃఖంతోటి, భారంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నానన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ప్రజాస్వామ్యాన్ని విచ్చలవిడిగా హత్య చేస్తున్నారన్నారు. బీజేపీ దేశాన్ని అన్ని రంగాల్లో దెబ్బతీస్తోంది. దేశంలో ప్రజాస్వామ్య ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. సీఎం ప్రెస్ మీట్ లో ఫామ్ హౌస్ లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలుస్తాం.. ఓడుతాం… ఒకసారి గెలుస్తాం.. ఒకసారి ఓడుతాం.. ప్రజల తీర్పును గౌరవించాల్సిందే.. మునుగోడు ఎన్నిక ఉందనే ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఈసీ కూడా బీజేపీ కోరుకున్నట్టుగా పనిచేయాలా అంటూ ప్రశ్నించారు కేసీఆర్. ఎన్నికల కమిషన్ విఫలమైందని చెప్పడం దారుణమన్నారు కేసీఆర్.. ప్రజాస్వామ్యానికి మూలస్థంభాలుగా నాలుగు వ్యవస్థలున్నాయన్నారు. లెజిస్లేచర్, కార్యానిర్వాహక వ్యవస్థ, జ్యూడిషియరీ, ప్రెస్‌‌ను స్వతంత్రంగా పనిచేసుకోనివ్వడం లేదన్నారు.