కేసీఆర్ చిల్లర రాజకీయాలు
కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ట్రాప్ చేసిందంటూ కొత్త డ్రామాకు కేసీఆర్ తెర తీశారని.. ఆ కట్టుకథలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. కొనుగోలు చేసేందుకు ప్రయత్నించామంటున్న నలుగురు ఎమ్మెల్యేల్లో ఒక్కరికీ మళ్లీ గెలిచే సత్తా లేదని ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నిక తేదీ సమీపిస్తున్న తరుణంలో కేసీఆర్, కేటీఆర్ ఆడుతున్న కొత్త నాటకంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అభివర్ణించారు. తండ్రీకొడుకుల చెత్త వ్యవహారాలు, దిగజారుడు రాజకీయాలు కొత్తేం కాదన్నారు.