బీఆర్‌ఎస్‌తో కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు
దేశంలో ఎక్కడ ఆరోపణలు వచ్చిన సీబీఐ వస్తుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. లిక్కర్ స్కామ్‌తో కవితకు సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఏ యాగం చేసినా ఫలితం ఉండదని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌తో కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని బండి డిమాండ్ చేశారు. మళ్లీ తెలంగాణలో సెంటిమెంట్‌ని రగిల్చి ప్రజల మనసు గెలుచుకునేందుకు పావులు కదుపుతున్నారంటూ ఆరోపణలు చేశారు. ఈ సెంటిమెంట్‌తో రాజకీయ లబ్ది పొందేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారంటూ బండి సంజయ్ ఫైర్ అయ్యారు.

