కవిత దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదు.. కేసీఆర్ ఇంటి ముందు: షర్మిల
మహిళా బిల్లును సాధించే వరకు తగ్గేదే లేదంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించేవరకు వెనుకంజ వేసేది లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. పార్లమెంట్ ఉభయసభల్లో మెజార్టీ ఉన్నా ఎందుకు… మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించరని… బీజేపీపై ఆమె విరుచుకుపడ్డారు. మహిళా బిల్లు కోసం పోరాటం చేస్తూనే ఉంటానన్నారు. ఐతే ఎమ్మెల్సీ కవిత దీక్షపై భగ్గుమన్నారు షర్మిల. ఏ ముఖం పెట్టుకొని, కవిత 33 శాతం రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీ వెళ్లి పోరాటం చేస్తారని ప్రశ్నించారు. పోరాటం చేయాల్సింది కేసీఆర్ ఇంటి ముందు అని, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ముందని గుర్తు చేశారు. ఢిల్లీ దీక్ష కంటే ముందుగా కవిత, కేసీఆర్‌తో మహిళల కోసం ఏం చేయించలేకపోయిందని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కుపోయింది కాబట్టే… అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, ఈవాళ 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. కేవలం లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కొని… ఇక అరెస్టు తరువాయని అర్థమయ్యింది కాబట్టే… మళ్లీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని అడ్డుపెట్టుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు షర్మిల. తెలంగాణ ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుందని.. ఆమె ఒక ఫైటర్ అని బిల్డప్ ఇస్తున్నారని… నిజంగా మహిళలపై ప్రేమ ఉంటే.. గవర్నర్‌ను పట్టుకొని అంత మాటంటే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
