సస్పెన్స్‌గా మారిన కామారెడ్డి…
సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజక వర్గంలో గెలుపెవరిదనేది అత్యంత సస్పెన్స్‌గా మారింది. కొడంగల్‌లో ఇప్పటికే గెలుపొందిన రేవంత్ రెడ్డి, కామారెడ్డిలో కూడా ఆధిక్యతలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆధిక్యత స్వల్పంగా ఉండడంతో పాటు అక్కడ త్రిముఖ పోటీ నెలకొని ఉండడం ఉత్కంఠను రేపుతోంది. కేసీఆర్, రేవంత్‌లకు తీసిపోని విధంగా బీజేపీ అభ్యర్థి వెంకటరమణ రెడ్డి కూడా స్వల్ప తేడాతోనే ఉన్నారు. రేవంత్ రెడ్డి 29,886 ఓట్లతో ఆధిక్యతలో ఉండగా, కేసీఆర్ 28,118 ఓట్లతోనూ, బీజేపీ అభ్యర్థి వెంకట రమణ రెడ్డి 25,779 ఓట్లతో కొనసాగుతున్నారు. దీనితో చివరి రౌండ్ ముగిసే సరికి ఏ పార్టీకి ఆధిక్యత దక్కుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.