అమెరికాలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’
ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో గురువారం విడుదలైన కల్కి 2898ఏడీ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మహాభారత కథతో ముడిపెట్టిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నార్త్ అమెరికాలో ప్రీమియర్ కలెక్షన్స్‌లో టాప్‌లో నిలిచి ఆల్ టైమ్ రికార్డు సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది. ప్రీ సేల్ బుకింగులోనే బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాల కలెక్షన్లను అధిగమించింది. 3.8 మిలియన్ల డాలర్లు వసూలు చేసింది. ప్రీమియర్, మొదటి రోజు కలెక్షన్లు కలిపి 5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అమెరికాలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది. ఈ చిత్రంలో నటించిన అమితాబ్, కమల్, దీపికా పదుకొనే వంటి నటులు తమ నటనతో ప్రేక్షకులను కట్టి పడేశారు.

