మై లవ్ మై నీల్ అంటూ కాజల్ లేఖ
కాజల్ తన కుమారుడు నీల్ ను ఉద్దేశిస్తూ ఓ లేఖ రాసింది. దానికి తన కుమారుడి ఫోటోను కూడా జత చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే పోస్ట్ పెట్టిన గంటలోనే 6 లక్షల మంది లైక్ చేశారు. ఎప్పుడూ సోషల్ మీడియాలోయాక్టివ్‌గా ఉండే కాజల్ , తనకు సంబంధించిన ఏ చిన్న విషమైనా సరే ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. కాగా ఆమె కుమారుడు నీల్ పుట్టి 6 నెలలు పూర్తయిన సందర్భంగా కాజల్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చింది. “అప్పుడే నువ్వు పుట్టి 6 నెలలు అవుతోంది. కాలం ఎంత తొందరగా గడిచిపోయింది. ఒక యంగ్ మదర్‌గా నీ విషయంలో నేను మొదట భయపడ్డాను. ఒక తల్లిగా నా కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వర్తించగలనా లేదా అనుకున్నాను. ఇప్పటికీ గొప్ప తల్లిని ఎలా అవ్వాలో నేర్చుకుంటూనే ఉన్నాను. నాకు ఎన్ని పనులు ఉన్నా.. నీ కోసం సమయాన్ని కేటాయిస్తూనే ఉంటాను. నీ పై శ్రద్ధ చూపడంలో ఎక్కడ రాజీపడను. నిన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను. ఇది నాకు సమాలుతో కూడుకున్నదే అయినా.. నేను పొందే ఆనందం ముందు ఆ సవాలు చిన్నదే అనిపిస్తుంది. నువ్వు రాత్రి చేసే అల్లరి నాకు సంతోషాన్ని ఇస్తుంది. నేను మీ నాన్న నీ గురించి సరదాగా మాట్లాడుకుంటాము. నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని నేను గుర్తుపెట్టుకుంటాను. మై లవ్.. మై నీల్” అంటూ ఆమె పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.
