తెలుగుదేశం, జనసేన పార్టీల జాయింట్ యాక్షన్ కమిటీ…పొత్తుపై సమాలోచన..
తెలుగుదేశం, జనసేన పార్టీల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి సంబంధించిన తొలి అడుగు పడింది.రాజమండ్రి వేదికగా తొలి సమావేశాన్ని నిర్వహించాలని రెండు పార్టీలు ఉమ్మడి నిర్ణయాన్ని తీసుకున్నాయి.జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ కీలక సమావేశం జరగనుంది.రెండు పార్టీల పొత్తుల్లో భాగంగా కీలక అంశాలపై నిర్ణయాలు పార్టీ నేతల సమన్వయానికి సంబంధించి ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఇప్పటికే నియమించింది.జనసేన నుంచి ఐదుగురు సభ్యులు, తెలుగుదేశం పార్టీ నుంచి మరో ఐదుగురు సభ్యులతో మొత్తం పదిమందితో రెండు పార్టీల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు అయింది.పొత్తుల్లో అత్యంత కీలకమైన సమన్వయ బాధ్యతలను ఈ కమిటీ నిర్వర్తించనుంది. ఇంత కీలకమైన ఈ కమిటీ తొలి సమావేశం ఈనెల 23న రాజమండ్రిలో జరగనుంది. 23వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకి ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కమిటీ తొలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలతో పాటు భవిష్యత్తు కార్యాచరణ రెండు పార్టీల క్షేత్రస్థాయి ఉమ్మడి ప్రచార కార్యచరణ తదితరా అంశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే చంద్రబాబు అరెస్ట్ అనంతరం జరిగిన పరిణామాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సమాలోచనలు చేసి క్షేత్రస్థాయిలో చేయాల్సిన ఉమ్మడి పోరాటాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.